సోషల్ మీడియాలో యువతికి వేధింపులు..ఇద్దరు అరెస్ట్

ARESTసోషల్ మీడియా వేదికగా ఓ యువతిని వేధిస్తున్న ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ నిజాంపేటలోని ఓ యువతి పినాకిల్ హోటల్ మెనేజ్‌మెంట్ కళాశాలలో చదివింది. అక్కడే అంకం రాజుతో స్నేహం ఏర్పడింది. ఈ స్నేహంలో సన్నిహితంగా ఉన్న ఇద్దరు వివాహం చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు.

అయితే వీరి పెళ్లిని తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఆ తర్వాత బాధితురాలు ఉద్యోగ రిత్యా దుబాయ్‌ కు వెళ్లింది. అప్పటి నుంచి అంకం రాజు ఫోన్‌ లు, మెసేజ్‌ లు పెడుతున్నా ఆమె స్పందించలేదు. దీంతో కక్ష పెంచుకున్న రాజు.. ఆమెతో స్నేహంలో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలను స్నేహితులు, బంధువుల, వాట్సాప్ గ్రూప్, ఫేస్ బుక్ లో పెట్టి ఆమెను వేధించడంతో పాటు డబ్బులు డిమాండ్ చేశాడు. అంతటితో ఆగని రాజు..మరిన్ని డబ్బుల కోసం పోర్న్ వెబ్‌ సైట్లలో ఆ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేశాడు. పోర్న సైట్లలో ఆ యువతి ఫోటోలు చూసిన.. సికింద్రాబాద్‌ కు చెందిన సుస్రుత్ రాజీవ్ వాటిని డౌన్‌లోడ్ చేసుకుని, మరికొన్ని అశ్లీల వెబ్‌ సైట్లతో పాటు మరికొంత మందికి వాటిని షేర్ చేస్తూ బాధితురాలి ఫోన్ నెంబర్‌ను వాటిలో పొందుపర్చాడు. దీంతో చాలా మంది బాధితురాలికి ఫోన్ చేసి వేధిస్తుండడంతో తీవ్ర మానసిక వేదనకు గురైంది. ఈ విషయాన్ని తల్లికి తెలుపగా.. ఆమె సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. విచారణలో పూర్తి ఆధారాలు, పలు ఐపీ అడ్రస్సుల వివరాలను సేకరించి నిందితులు అంకంరాజు, సుస్రుత్ రాజీవ్‌లను అరెస్టు చేశారు.

Posted in Uncategorized

Latest Updates