సోషల్ మీడియా డే : తిండి లేకపోయినా పర్వాలేదు.. చాటింగ్ ఉండాలి

social-mediaఫేస్‌బుక్, వాట్సప్, లింక్డిన్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్ అంటూ.. సగటు మనిషి జీవితం సోషల్‌ మీడియాతో పెనవేసుకుపోయింది. మనుషులేకాదు… వ్యాపార సంస్థలు, సినిమాలు, రాజకీయ పార్టీలు… ఇలా అన్నీ బాగా కనెక్టయ్యాయి సోషల్ మీడియాతో. ముఖ్యంగా యువతను స్మార్ట్‌ఫోన్‌లు దోహదం చేశాయి.

యువతరం పూర్తిగా సోషల్ మీడియా వలలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నారు. ఎంతసేపు చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వీడియోలు చూస్తూ, చాటింగ్ చేస్తూ చుట్టుపక్కల ప్రపంచాన్నే  మర్చిపోతున్నారు. స్మార్ట్ ఫోన్ చూస్తూ రోడ్లు దాటుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. దీనికితోడు సెల్ఫీలంటూ వెర్రీ వ్యామోహంతో ప్రాణాలు కోల్పోతున్నారు. సోషల్ మీడియా వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దాన్ని సద్వినియోగం చేసుకోకుండా నేటి యువత దాని వల్ల నష్టపోతుందనడంలో అతిశయోక్తి లేదు.

జూన్ 30వ తేదీ అంతర్జాతీయ సోషల్‌ మీడియా దినోత్సవం. సోషల్‌ నెట్‌ వర్కింగ్‌ (సామాజిక మాధ్యమం) అనే పదాన్ని మొదటిసారిగా అమెరికాలోని కేంబ్రిడ్జి యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్‌ జె.ఎ. బార్నెస్‌ 1950వ సంవత్సరంలో ఉపయోగించారు. కుటుంబం, వృత్తి, అభిరుచులు, అలవాట్ల ప్రాతిపదికగా ఏర్పడే ప్రజాబృందాలనే సోషల్‌ నెట్‌వర్క్‌గా బార్నెస్‌ నిర్వచించారు. అది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అమెరికాలో పుట్టిన సోషల్ మీడియా మొదట కిట్టీపార్టీలు, సభలు, సమావేశాలు వరకు ఉండేది. టెక్నాలజీతో అది ఇప్పుడు డిజిటల్ అయ్యింది. ఎక్కడెక్కడో ఉన్న వారిని అరచేతిలో చూపిస్తోంది. భవిష్యత్ లో మరింతగా అభివృద్ధి చెంది.. ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.

Posted in Uncategorized

Latest Updates