సోషల్ మీడియా మోత మోగుతోంది : మున్నాభాయ్, ప్రియాగా రాహుల్

పార్లమెంట్ లోక్ సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా తన ప్రసంగం ముగిసిన తర్వాత ప్రధాని మోడీని హగ్ చేసుకుని విషెస్ చెప్పారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఆ తర్వాత తన సీట్లో కూర్చుని కన్నుకొట్టాడు. రాహుల్ లోక్ సభ వ్యవహారంపై సోషల్ మీడియా మోత మోగుతోంది. నెటిజన్లు బీభత్సంగా స్పందిస్తున్నారు. సెటైర్లతో దుమ్మురేపుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ సైతం అఫిషీయల్ గా స్పందించాయి. కామెంట్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..

… భారతీయత అంటే ఏమిటో రాహుల్ చూపించారని, మోడీ, బీజేపీ నాయకులు కాంగ్రెస్ ను చూసి ఇకనైనా బుద్ది తెచ్చుకోవాలని కాంగ్రెస్ అంటోంది.

… మీరిచ్చిన ఆనందానికి ధన్యవాదాలు కూడా చెప్పకలేకపోతున్నాం అంటూ బీజేపీ అంటోంది.

… మోడీని హగ్ చేసుకుని డ్రామాలు చేస్తున్నారు. రాహుల్ నెక్స్ స్టెప్ ఖచ్చితంగా బాలీవుడ్ లో ఉంటుంది.

… రాహుల్ ని త్వరలోనే బాలీవుడ్ కు పంపిస్తాం అంటూ బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్ కామెంట్ చేశారు.

… మోడీ.. రాహుల్ హగ్ టేస్ట్ చూశాడు..

… రాహుల్ గాంధీ మున్నాభాయ్ గా ఎంబీబీఎస్ గా మారిపోయాడు.

… కన్ను కొట్టటం ప్రియా ప్రకాష్ వారియర్ నుంచి నేర్చుకున్నట్లు ఉన్నాడు ఈ పప్పు.

… ప్రియా వారియర్.. నీకు రాహుల్ గాంధీ గట్టిగా పోటాదారుడిగా వచ్చాడు.

… అవిశ్వాసంపై సీరియస్ గా చర్చ జరుగుతుంది.. జరగాల్సిన అవసరం ఉంది. రాహుల్ చేష్టలు పార్లమెంట్ స్థాయిని దిగజార్చాయి.

… రాహుల్ చర్చలు చూస్తుంటే.. ఇంకా ఎదగలేదని అనిపిస్తోంది. తనను తనను పప్పూ అని నిరూపించుకున్నాడు.

… రాహుల్ స్పీచ్ తో లోక్ సభలో భూకంపం వచ్చింది.

… పార్లమెంట్ లో సీరియస్ నెస్ అనే సెన్స్ లేదు.. చిన్నపిల్లల మనస్తత్వంగా ఉంది.

… రాహుల్ చర్యలతో అవిశ్వాసం తీర్మానంపై చర్చ అనేది జోక్ గా తయారైపోయింది.

… 2018 పార్లమెంట్ లవ్ స్టోరీ ఇది.. ఇదో అసాధారణమైన లవ్ స్టోరీగా ఉంది.

… రాహుల్ సరికొత్త రాజకీయం నేర్చుకున్నట్లు కనిపిస్తోంది. కాకపోతే ఇది వేదిక కాదు.

Posted in Uncategorized

Latest Updates