సోషల్ మీడియా హబ్ పై వెనక్కి తగ్గిన కేంద్రం

సోషల్ మీడియా హబ్ ఏర్పాటును ఉపసంహరించుకున్నట్లు శుక్రవారం(ఆగస్టు-3) అపెక్స్ కోర్టుకి కేంద్రం తెలిపింది. వాట్సాప్, లింక్డ్ ఇన్, ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా యాప్ లు వాడుతున్న యూజర్లను మానిటరింగ్ చేసేందుకు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకుంది కేంద్రం. సోషల్ మీడియా హబ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ….తృణముల్ కాంగ్రెస్ MLA మహువా మోయిత్రా వేసిన పిటీషన్ విచారించిన కోర్టు…. గవర్నమెంట్ నెటిజన్ల వాట్సాప్ మెసేజ్ లను ట్యాపింగ్ చేయడమంటే…. నిఘూ స్ధితిని సృష్టించడమేనని కోర్టు అభిప్రాయపడింది.

సోషల్ మీడియా హబ్ ఏర్పాటు ప్రతిపాదనపై పెద్ద ఎత్తున ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ఖచ్చితంగా తమ వ్యక్తిగత హక్కులను కాలరాయడమేనని ధ్వజమెత్తారు. ఈ ప్రతిపాదనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో కేంద్రం వెనక్కి తగ్గింది.

Posted in Uncategorized

Latest Updates