సౌతాఫ్రికా చిత్తు : టీ20 సిరీస్ టీమిండియాదే

sreఓటమితో మొదలుపెట్టి.. విజయంతో సఫారీ టూర్ ని ముగించింది టీమిండియా. పోగొట్టుకున్నచోటనే గెలిచి సత్తా చాటింది. నెలన్నర రోజులు సాగిన పర్యటనలో.. టెస్టు ఓటమితో సఫారీ వేటను మొదలుపెట్టిన భారత్.. వన్డే, టీ20 సిరీస్ లను పట్టేసి విజయగర్వంతో దేశం తిరిగొస్తోంది. కీలకమైన లాస్ట్ టీ20లో కోహ్లీ లేకపోయినా.. బ్యాట్స్ మెన్, బౌలర్లు సమిష్టిగా రాణించారు. దీంతో 7 పరుగులతో విజయం సాధించి.. పొట్టి ఫార్మెట్ నీ గెలుచుకుంది భారత్. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్.. 7 వికెట్లు కోల్పోయి 172 రన్స్ చేసింది. డుమినీ, క్రిస్టియాన్ కొద్దిసేపు మెరుపులు మెరిపించినా.. భారత బౌలర్ల పట్టు విడవలేదు. దీంతో 2-1 తేడాతో సిరీస్ భారత్ సొంతమైంది. సౌతాఫ్రికా టూర్ లో రెండు ఫార్మెట్లలో సిరీస్ గెలిచిన రికార్డును సొంతం చేసుకుంది కోహ్లీ సేన. టెస్ట్ సిరీస్ ని మాత్రం 2-1 తేడాతో ఓడింది.

Posted in Uncategorized

Latest Updates