సౌత్ ఇండియా కన్నా పాకిస్ధానే బెటర్ : సిద్దూ

పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ పాకిస్ధాన్ పై మరోసారి తన ప్రేమను పదర్శించుకున్నారు. అయితే దాని కోసం దక్షిణ భారతదేశపు భాష, ఆహారపు అలవాట్లపై నోరు పారేసుకున్నారు. సౌత్ ఇండియాకు వెళ్లడం కన్నా పొరుగున ఉన్న పాకిస్ధాన్ వెళ్లడమే మంచిదన్న వరకూ వెళ్లారు. భాష, అక్కడి తిండి సమస్యలు చూసుకొంటే సాత్ ఇండియా కన్నా పాకిస్ధాన్ బెటర్ అని కామెంట్ చేశారు. క

సోల్ లోని లిటరరీ ఫెస్టివల్ లో శనివారం(అక్టోబర్-13) సిద్దూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సౌత్ ఇండియాపై ఈ విధమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. సౌత్ ఇండియా వెళ్లేటప్పుడు వణక్కం లాంటి ఒకట్రెండు పదాలు తప్ప తనకు ఏమీ అర్ధం కావని అన్నాడు. ఇడ్లీ లాంటివి ఒకట్రెండు రోజులు అయితే ఫర్వాలేదుకానీ ఎక్కువ రోజులు మాత్రం అక్కడి ఫుడ్ తో కష్టమే అని అన్నారు. అదే పాకిస్ధాన్ వెళితే వాళ్లు పంజాబీ, ఇంగ్లీషు మాట్లాడతారు అని సిద్దూ పొరుగుదేశంపై ప్రేమ ఒలకబోశారు.

Posted in Uncategorized

Latest Updates