సౌదీలో కొత్త చరిత్ర : సాయంత్రం బులెటిన్ చదివిన మహిళా న్యూస్ రీడర్

సౌదీ అరేబియా : గల్ఫ్ కంట్రీ  సౌదీ అరేబియాలో మహిళల పై ఉన్న కఠినమైన ఆంక్షలు క్రమంగా తొలగిపోతున్నాయి. విజన్ 2030 కార్య్రకమంలో భాగంగా  సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్… మహిళలు ఉద్యోగాలు చేయడానికి వీలుగా సంస్కరణలు చేశారు.  ఇటీవలే మహిళలు కార్ డ్రైవింగ్ చేసే అవకాశం కల్పించిన ఆ దేశం… ఇప్పుడు తమ అధికార ఛానల్ సౌదీ టీవీలో ఓ మహిళా యాంకర్ ను తీసుకుంది. ఛానెల్ లో సాయంత్రం బులెటిన్ చదివే అవకాశం ఇచ్చింది.

తొలిసారిగా సాయంత్రం బులెటిన్ చదివిన మహిళగా వీమ్ అల్ డఖీల్ రికార్డ్ క్రియేట్ చేసింది.  2016లో జుమానా అల్ షమి అనే మహిళ ఉదయం బులెటిన్ చదవగా.. ఇప్పుడు వీమ్ అల్ డఖీల్.. మేల్  యాంకర్ తో కలిసి సాయంత్రం బులెటిన్ చదివి చరిత్ర సృష్టించిందని సౌదీ టీవీ తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates