స్కార్ఫ్ తో ఆడలేను : ఇరాన్ చెస్ టోర్నీనుంచి తప్పుకున్న సౌమ్య

SOUMYAమాజీ వరల్డ్‌ జూనియర్‌ గర్ల్స్‌ చాంపియన్‌, ఉమెన్‌ గ్రాండ్‌ మాస్టర్‌ సౌమ్య స్వామినాథన్‌ ఇరాన్‌ లో జూలై 26 నుంచి ఆగస్ట్ 6వ తేదీ వరకు జరగబోయే చెస్ టోర్నమెంట్ నుంచి తప్పుకున్నారు. తలపై స్కార్ఫ్ తో భారంగా ఉంటుందని.. ఈ నిబంధనకు వ్యతిరేకంగా ఏషియన్‌ టీమ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించింది సౌమ్య స్వామినాథన్‌.

ఇరాన్‌ దేశంలో ఉన్న రూల్ ప్రకారం.. తలకు తప్పనిసరిగా స్కార్ఫ్‌ ధరించాలి. ఈ విషయంపై ఫేస్ బుక్ లో వివరణ ఇచ్చిన సౌమ్య.. ఇరానీ చట్టంలో మహిళలు తప్పనిసరిగా స్కార్ఫ్, బురఖా దరించాలనే నియమం ఉంది. బలవంతంగా స్కార్ఫ్, బురఖా దరించడం అంటే నా స్వేచ్ఛకు ఆటంకం కలిగించినట్లేనని తెలిపారు. అందుకే నేను ఇరాన్ టోర్నమెంట్ కు వెళ్లలేకపోతున్నాను. అభిమానులు క్షమించాలని కోరారు పుణెకు చెందిన చెస్ ప్లేయర్ సౌమ్య స్వామినాథన్.

Posted in Uncategorized

Latest Updates