స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ కు కృషి చేస్తా: వివేక్ వెంకటస్వామి

vivekరాష్ట్రంలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి. ఎప్పుడూ సక్సెస్ స్టోరీసే కాదు ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా చదివితేనే జీవితంపై అవగాహన వస్తుందన్నారు. యువతకు బిజినెస్ ట్రిక్స్ చెప్పారు. సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే సొసైటీ లో మంచి ఎంటర్ ప్రెన్యూర్ గా నిలుస్తారన్నారు వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ పంజాగుట్టలో.. KCP స్కిల్ డెవలప్ మెంట్ బస్సుయాత్రను  ప్రారంభించారు. ఉన్నత స్థాయికి చేరినా..  ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ను మర్చిపోవద్దన్నారు. ప్రతిరోజు పుస్తకం చదవాలని, సమాజం నుంచే అన్నివిషయాలు తెలుసుకుంటే ఫ్యూచర్ ఎంటర్ ప్రెన్యూర్ కావొచ్చని వివేక్ వెంకటస్వామి చెప్పారు.

ఆరు రోజులు జరగనున్న  స్కిల్ డెవలప్ మెంట్ యాత్రలో హైదరాబాద్, అనంతపురం, అమరావతి, కాకినాడ, విశాఖ లాంటి ప్రాంతాల్లో  అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన స్టూడెంట్స్ కు ఈ యాత్ర మంచి అనుభవం ఇస్తుందని.. ఎక్కువగా రియల్ స్టోరీస్ ను చెప్పడానికే ట్రిప్ ఏర్పాటు చేశామన్నారు నిర్వాహకులు.

స్టూడెంట్స్ కూడా ఈ ట్రిప్ తో చాలా విషయాలు నేర్చుకుంటామని… ఇలాంటి ఫ్లాట్ ఫాంతో తమకి బిజినెస్ ట్రిక్స్ తెలుస్తాయంటున్నారు.ఆంట్ర ప్రెన్యూర్ షిప్ పై దాదాపు 32 మంది విద్యార్థులు ఆరురోజుల పాటు బస్సు యాత్ర చేయనున్నారు.

Posted in Uncategorized

Latest Updates