స్కూలు బస్సులో పొగలు.. పిల్లలకు తప్పిన ప్రమాదం

నారాయణ సంస్థకు చెందిన స్కూల్ బస్సులో పిల్లలకు తృటిలో ప్రమాదం తప్పింది.  రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బైపాస్ లోని బాబా దాబా దగ్గర బస్సునుంచి అకస్మాత్తుగా పొగలు వచ్చాయి. చుట్టుపక్కల వాళ్లు గమనించి… వెంటనే బస్సు వెనుక ఉన్న అద్దాలు పగలకొట్టి… విద్యార్థులను సురక్షితంగా దించేశారు. వాళ్లను దూరం తీసుకెళ్లారు. బస్సులో దట్టమైన పొగలు రావటంతో పిల్లలంతా ఒక్కసారిగా భయపడి ఏడుస్తూ అరిచారు. వైర్ షార్ట్ సర్కూట్ కావడంతోనే పొగలు వచ్చి ఉంటాయని డ్రైవర్ అన్నాడు. పొగలు బస్సు నిండా వ్యాపించడంతో ఏం చేయాలో అర్థం కాలేదని.. వెనుక నుంచి పిల్లలను దించేందుకు సహాయపడ్డానని డ్రైవర్ చెప్పాడు. కాసేపటికి పొగలు ఆగిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పిల్లలను వేరే వాహనంలో స్కూల్ కు తరలించారు.

Posted in Uncategorized

Latest Updates