స్కూల్లో దారుణం : లేట్ గా వచ్చారని బట్టలు విప్పించి ఎండలో నిలబెట్టారు

మన స్కూళ్లలో పిల్లలను కొట్టడం, బస్కీలు తీయించడం ఏనాడో నిషేధించారు. లేట్ గా వచ్చారని.. హోంవర్క్ చేయలేదని… పిల్లలను ఎండలో నిలబెట్టడం… నీల్ డౌన్(మోకాళ్లపై నుంచోబెట్టడం) చేయించడం కూడా తప్పే. ఇవన్నీ చైల్ట్ రైట్స్ వయోలేషన్ కిందకు వస్తాయి. కానీ కొన్ని ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ఇంకా పద్ధతి మార్చుకోవడం లేదు. పిల్లలను బెదిరించడానికి కొన్ని సందర్భాల్లో తప్పదని టీచర్లు అంటున్నా… అది చట్టరీత్యా నేరమే.

చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం.. చైతన్యభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టీచర్లు.. పిల్లలకు కఠిన శిక్ష వేశారు.  స్కూలుకు ఆలస్యంగా వచ్చారన్న కారణంతో…. విద్యార్థులను షర్ట్, ప్యాంట్ విప్పించి ఎండలో నిలబెట్టారు. టీచర్ల పనిష్మెంట్ తో పిల్లలు చాలాసేపు బట్టలు లేకుండా ఎండలో నిలబడి ఇబ్బంది పడాల్సి వచ్చింది.  ఈ సంఘటనను దూరం నుంచి కొందరు సెల్ ఫోన్ లో వీడియో తీశారు. వీడియో బయటకు వచ్చినా కూడా స్థానిక విద్యాధికారులు పెద్దగా స్పందించలేదని సమాచారం అందింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అంతటా చర్చ జరుగుతోంది. బాలల హక్కుల కార్యకర్త అచ్యుతరావు.. దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. పిల్లలకు ఇలాంటి పనిష్మెంట్ ఇవ్వడం దారుణమనీ.. ఆ స్కూలు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

దీనిపై దర్యాప్తు చేస్తున్నారు విద్యా శాఖ అధికారులు. బాలల హక్కుల కమిషన్  ఈ సంఘటనపై స్పందించింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని .. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని చిత్తూరు జిల్లా పోలీసులకు సూచించింది.

Posted in Uncategorized

Latest Updates