స్కూల్స్ లో మళ్లీ డిటెన్షన్ : ప్రకాశ్ జవదేకర్

PRAKSHపాఠశాల విద్యలో మళ్లీ డిటెన్షన్ విధానం తీసుకురానున్నట్టు చెప్పారు కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్. నో డిటెన్షన్ పాలసీలో మార్పులు చేస్తామన్నారు. దీనికి సంబంధించిన బిల్లును వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ లో ప్రవేశపెడతామన్నారు. ఇప్పటికే 25 రాష్ట్రాలు దీనికి అంగీకరించాయన్నారు. బిల్లు పాస్ అయితే.. ఐదు, ఎనిమిది తరగతల విద్యార్థులకు బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో ఫెయిల్ అయిన వారికి వారంలో మరోసారి పరీక్ష నిర్వహిస్తారు. అందులో కూడా ఫెయిల్ అయితే అదే తరగతి మరో ఏడాది చదవాల్సి ఉంటుంది.

Posted in Uncategorized

Latest Updates