స్కూల్‌ అసిస్టెంట్‌  ఫలితాలు విడుదల

tspscఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టుల ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రకటించింది. అభ్యర్థికి వచ్చిన మార్కుల వివరాలతో పాటు మెరిట్ ఆధారంగా వారికి రాష్ట్ర ర్యాంకులను కేటాయించింది. పోస్టుల భర్తీలో పారదర్శకతతో పాటు జిల్లాలోని 20 శాతం ఓపెన్ కేటగిరీ పోస్టులకు అన్ని జిల్లాల అభ్యర్థులకు అవకాశం కల్పిస్తూ ర్యాంకులను ప్రకటించింది.

1941 స్కూల్ ఆసిస్టెంట్ పోస్టుల్లో సబ్జెక్టుల వారీగా అభ్యర్థికి వచ్చిన రాష్ట్ర ర్యాంకు, హాల్‌టికెట్ నంబరు, మార్కులు, రిజర్వేషన్ కేటగిరీ, జిల్లా వివరాలతో ఫలితాలను ప్రకటించింది. మొత్తం 27 సబ్జెక్టులకు 1,17,410 మందితో మెరిట్ జాబితాను రూపొందించి TSPSC వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

ప్రస్తుతం జారీ చేసిన ర్యాంకుల జాబితాల నుంచి ఒక్కో పోస్టుకు 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితాలను సిద్ధం చేసి ఆయా జిల్లాలకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పంపించనుంది. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత జిల్లాల నుంచి వచ్చిన లిస్టులను బట్టి అభ్యర్థులను పోస్టులకు ఎంపిక చేయనుంది. మరోవైపు సెకండరీ గ్రేడ్ టీచర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, పండిట్ పోస్టులకు సంబంధించిన ర్యాంకులను కూడా త్వరలోనే ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తోంది TSPSC.

Posted in Uncategorized

Latest Updates