స్కూల్ టీచర్ పై యాసిడ్ దాడి

హైదరాబాద్‌లోని చింతల్‌లో ఓ టీచర్ పై యాసిడ్ దాడి జరిగింది. తీవ్ర గాయాలపాలైన  ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం(ఆగస్టు-2) రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 49 ఏళ్ల ఉప్పులూరి సూర్యకుమారి, లక్ష్మీనారాయణ దంపతులు స్థానిక పద్మానగర్‌ ఫేజ్‌-2లో నివసిస్తున్నారు.

సూర్యకుమారి చింతల్ కాకతీయ నగర్ లోని సిద్ధార్థ స్కూల్లో టీచర్ గా పని చేస్తున్నారు. అదే ప్రాంతలో ఓ గది అద్దెకు తీసుకుని ట్యుటోరియల్ నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే గురువారం ట్యూషన్ చెబుతుండగా రాత్రి 7:30 గంటల సమయంలో ముఖానికి కర్చిఫ్ కట్టుకునిక వచ్చిన  గుర్తుతెలియని ఓ వ్యక్తి ఆమెపై యాసిడ్ పోసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన సూర్యకుమారిని వెంటనే స్థానికులు కూకట్ పల్లిలోని రెమిడీ ఆస్పత్రికి తరలించారు. ఎప్పుడు రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో దాడి జరగడంపై …తెలిసిన వారు పథకం ప్రకారం చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates