స్కూల్ నుంచి వెళ్తుండగా లారీ ఢీ.. తల్లి,కొడుకు మృతి

హైదరాబాద్: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. స్కూల్ నుంచి ద్విచక్రవాహనం పై ఇంటికి కుమార్తె,కొడుకుతో వెళ్తున్న తల్లిని.. వెనుక వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి,కొడుకు మహేష్(4) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా కుమార్తె లక్ష్మీప్రియ తీవ్రంగా గాయపడింది. లక్ష్మీప్రియ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates