స్కూల్ ఫీజు కట్టలేదని.. చిన్నారిని చితకబాదారు

ED-100418-KRISHNAVENI-SHCOOL-VIS-1రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. స్కూల్ ఫీజు కట్టలేదని నాలుగేళ్ల బాలుడ్ని చితకబాదారు స్కూల్ నిర్వాహకులు. ఒళ్లంతా వాతలు పడేలా కొట్టారు. దీంతో బాలుడి వీపు, కాళ్లపై దద్దులు తేలాయి. మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని నందనవనం కాలనీ కృష్ణవేణి హైస్కూల్ లో ఈ ఘటన జరిగింది. స్కూలు నిర్వాహకుల తీరుపై పేరెంట్స్ ఆందోళనకు దిగారు. బాలుడి బంధువులతో పాటు మిగిలిన విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ముందు ధర్నా చేశారు. బాలుడ్ని చితకబాదిన స్కూల్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు.

Posted in Uncategorized

Latest Updates