స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి

baby death రంగారెడ్డి జిల్లా గోపిగడ్డ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. షాబాద్‌ మండలం గోపిగడ్డలో ఏడాదిన్నర చిన్నారి ఆద్య పాఠశాల బస్సు కింద పడి ప్రాణాలు కోల్పోయింది. తన అన్నను పాఠశాల బస్సు ఎక్కించేందుకు తండ్రిలో కలిసి బయటకు వచ్చిన ఆద్య అక్కడే ఆడుకుంటూ బస్సు కిందకు వెళ్లింది. పాపను గమనించని డ్రైవర్‌ బస్సును ముందుకు నడపడంతో చక్రాల కింద నలిగిపోయింది. ఈ ఘటనతో స్థానికంగా విషాదం చోటుచేసుకుంది.

Posted in Uncategorized

Latest Updates