స్కూల్ లోనే హత్య : 9వ తరగతి స్టూడెంట్ ను.. 10వ తగరతి విద్యార్థి చంపేశాడు

vadodarastudent

స్కూల్ అంటే పిల్లలు, టీచర్లు, ఆయాలు, డ్రైవర్లు ఉంటారు.. వీళ్లు తప్ప ఇంకెవరినీ ఊహించుకోలేం.. ఎందుకంటే అది స్కూల్ కాబట్టి.. అలాంటి పాఠశాలలో హత్య జరిగితే.. పిల్లోడు శరీరంలో కత్తిపోట్లు ఉంటే నిజంగా ఇది షాకింగ్. ఈ వార్త విని పేరంట్స్ కు చెమటలు పట్టాయి. స్కూల్ లోనే.. అక్కడ చదివే స్టూడెంట్ ఇంత కిరాతంగా హత్యకు గురవ్వటం ఏంటీ అనే ఆలోచన వారిని వణికిస్తోంది.. పూర్తి వివరాల్లోకి వెళితే..

గుజరాత్ రాష్ట్రం వడోదర సిటీ. బరన్ పోర ఏరియాలో శ్రీ భారతి విద్యాలయ ఉంది. పేరున్న పాఠశాల ఇది. ఈ స్కూల్ లో జూన్ 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరగరాని ఘోరం జరిగింది. స్కూల్ వాష్ రూంలో 9వ తరగతి చదువుతున్న స్టూడెంట్ చనిపోయి ఉన్నాడు. శరీరంపై కత్తిపోట్లు. రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుని ప్రాణాలు విడిచినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. అంతే ఒక్కసారిగా కలకలం. వడోదరలోని పేరంట్స్ అందరూ షాక్ అయ్యారు. వేలాది మంది స్కూల్ దగ్గరకు చేరుకున్నారు. పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.

9వ తరగతి స్టూడెంట్.. స్కూల్ లోనే హత్యకు గురవ్వటంపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు. వాష్ రూంలో కత్తి కూడా దొరికింది. సీసీ కెమెరాలు పరిశీలిస్తే.. 10వ తరగతి స్టూడెంట్ ఈ హత్య చేసినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే ఆ స్టూడెంట్ స్కూల్ లో లేడు. ప్రస్తుతానికి ఆచూకీ లేదు. చనిపోయిన విద్యార్థి ఇటీవలే ఈ స్కూల్ లో జాయిన్ అయ్యాడు. ఈ చిన్నారిది గుజరాత్ లోని ఆనంద్ జిల్లా. 9, 10 తరగతుల కోసం వడోదరలోని తన అత్త ఇంట్లో ఉండి చదువుకుంటున్నాడు. చంపిన స్టూడెంట్ ఎందుకు చేశాడు.. కారణాలు ఏంటీ అనేది ఆరా తీస్తున్నారు. 10వ తరగతి స్టూడెంట్.. ఇంత దారుణంగా హత్య చేయటం ఏంటీ.. కత్తిని స్కూల్ కు ఎలా తీసుకొచ్చాడు.. ఆ ఆలోచన ఎలా వచ్చింది అనే ప్రశ్నలు తల్లిదండ్రులకు షాకింగ్ మారాయి. చెమటలు పట్టిస్తున్నాయి. గత సంవత్సరం సెప్టెంబర్‌లో గుర్‌గావ్‌లోని ఓ పాఠశాల వాష్‌రూంలో ఏడేళ్ల విద్యార్థి గొంతు గోసి అతి దారుణంగా చంపాడు. ఆ సంఘటన మర్చిపోక ముందే ఈ ఘటన. ప్రస్తుతం వడోదర పట్టణంలోని టెన్షన్ నెలకొంది.

 

Posted in Uncategorized

Latest Updates