స్కూల్ వ్యాన్ కిందపడి చిన్నారి మృతి

CHINNARIడ్రైవర్ చూసుకోకపోవడంతో చిన్నారి మృతి చెందిన సంఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. మూడేళ్ల పాప స్కూల్‌ వ్యాన్‌ కిందపడి మరణించింది. ఈ ప్రమాదం మంగళవారం (జూన్-26) చొప్పదండి మండలం గుమ్లాపూర్‌ లో జరిగింది. ఉదారపు శ్రీనివా్‌స-మమత దంపతులు కుమార్తె మాన్విత (3)ను 3 రోజుల క్రితమే చొప్పదండి కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌ లో చేర్పించారు. మంగళవారం స్కూల్‌ వ్యాన్‌ ఇంటి సమీపంలో నిలవగానే మాన్విత దిగి ఒక్కసారిగా ముందుకు పరుగెత్తింది. వ్యాన్‌ ముందుకు కదలడంతో టైర్‌ కింద పడి తల నుజ్జునుజ్జు అయి మృతి చెందింది. మృతదేహాన్ని స్కూల్‌ కు తరలించి గ్రామస్థులు ఆందోళన చేశారు. వ్యాన్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందని, పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ.. పాఠశాల ఆవరణలో బైఠాయించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Posted in Uncategorized

Latest Updates