స్కూల్ వ్యాన్ లో మంటలు : విద్యార్థులకు తప్పిన ప్రమాదం

నిర్మల్ లో స్కూలు పిల్లలకు పెద్ద ప్రమాదం తప్పింది. బుధవారం (జూలై-18) 10 మంది చిన్నారులతో వెళ్తున్న టాటా మ్యాజిక్ వాహనంలో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీంతో వెంటనే వ్యాన్ ను ఆపేసి, పిల్లలకు కిందకు దించాడు డ్రైవర్. మంటలు చెలరేగడంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. ప్రాణాపాయం తప్పడంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. వేరే బస్సులో  విద్యార్థులను స్కూలుకు తరలించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల వాహనంలో మంటలు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో వ్యాను పూర్తిగా కాలిపోయింది.

Posted in Uncategorized

Latest Updates