స్టడీ సర్టిఫికెట్లలో ‘తల్లి పేరు’ తప్పనిసరి

స్టడీ సర్టిఫికెట్లలో కేంద్ర ప్రభుత్వం కొత్త విధానంపై దృష్టిపెట్టింది. ఇక నుంచి యూనివర్శిటీలు, విద్యాసంస్థలు జారీ చేసే  సర్టిఫికెట్లలో అభ్యర్థి తల్లిపేరు తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు విద్యార్థి పేరు, తండ్రిపేరు, తండ్రి లేని పక్షంలో గార్డియన్ పేరుకు అవకాశం ఉండేది. ఇక నుంచి విద్యాసంస్థల్లో చేరేటప్పుడే తల్లి వివరాలు సేకరిస్తారు. అది లేకుండా దరఖాస్తులను స్వీకరించరు. దీనికి సంబంధించి అన్ని వర్శిటీలకు, విద్యాసంస్థలకు విద్యార్థుల సర్టిఫికెట్లలో తల్లిపేరును నమోదు చేయాలని ఆదేశాలు జారీచేసింది.

Posted in Uncategorized

Latest Updates