స్టన్నింగ్ లుక్ తో మార్కెట్లోకి న్యూ సాంత్రో..

హ్యుండయ్ కంపెనీ కార్లలో సాంత్రో  ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది. గతంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు కార్ కొనాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ కార్ కే ఇచ్చేవారు. కస్టమర్లలో శాంత్రో  కి ఉన్న క్రేజ్ ను గుర్తించిన హ్యుండయ్ .. రీసెంట్ గా ఆ కార్ ను రీ మోడల్ చేసి మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ కార్ ప్రీ బుకింగ్స్ అక్టోబర్.11 నుంచి 22 వరకు కొనసాగుతుందని.. రూ.11,100  టోకెన్ అమౌంట్ తో న్యూ శాంత్రోను బుక్ చేసుకోవచ్చని సంస్థ ప్రకటించింది.

ఫస్ట్ బుక్ చేసే 50 వేల మంది కస్టమర్లకు ఈ అవకాశం ఉంటుందని తెలిపింది. కార్ లోపల 17.64 సెంటీమీటర్ల టచ్ స్క్రీన్ ఆడియో,వీడియో సిస్టం ఉంది. దీనిని స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. వాయిస్ రికగ్నైజేషన్, రేర్ పార్కింగ్ కెమెరా డిస్ ప్లే ఈ స్క్రీన్ లో ఉన్నాయి. స్టాండర్డ్ ఏబీఎస్ తో పాటు ఎయిర్ బ్యాగ్స్ ఉండటం ఈ కార్ స్పెషాలిటీ.. కార్ ధరను రూ.4 లక్ష‌ల నుంచి రూ.6 లక్ష‌ల మధ్య ఫిక్స్ చేశారు.

Posted in Uncategorized

Latest Updates