స్టాక్ మార్కెట్ పండగ : దుమ్మురేపిన లాభాలు

ముంబై దలాల్ స్ట్రీట్ నవ్వుతోంది.. ఆనందంలో గంతులేస్తోంది. ఎన్ని రోజులు ఇలా చేసుకుంటారో తెలియదు కానీ.. జూలై 26వ తేదీ మాత్రం భారీ లాభాలతో పెట్టుబడిదారులు, వ్యాపారులు పండగ చేసుకుంటున్నారు. ఫస్ట్ టైం చరిత్రలో.. సెన్సెక్స్ 37వేల పాయింట్లు టచ్ అయ్యింది. ఇది ఆల్ టైం హై. ఇక నిఫ్టీ కూడా 11వేల 170 పాయింట్లతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. బాంబే స్టాక్ మార్కెట్ చరిత్రలోనే మొదటి సారి ఈ రెండూ కొత్త రికార్డ్స్ దూసుకుపోతున్నాయి.

కంపెనీలు ప్రకటిస్తున్న క్వార్టర్లీ ఫలితాలు ఆశాజనకంగా ఉండటం, అంతర్జాతీయంగా బంగారం నుంచి పెట్టుబడులు స్టాక్ మార్కెట్లలోకి వస్తుండటంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లలో ర్యాలీ కొనసాగుతుంది. స్టేట్ బ్యాంక్ ఇండియా బ్యాంక్ షేర్లు అయితే ఏకంగా 5శాతం పెరిగి ఆశ్యర్యం కలిగించాయి. ICICI బ్యాంక్ షేర్లు కూడా 2శాతం లాభపడ్డాయి. టాటా మోటార్స్, ఐటీసీ, ఎయిర్ టెల్, ఆదానీ పోర్ట్, కోల్ ఇండియా, ఆటోమొబైల్ కంపెనీల షేర్లు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

స్టాక్ మార్కెట్ ఆల్ టైం హైలోనూ కొన్ని షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వాటిలో ఏషియన్ పెయింట్స్, కొటాక్ మహీంద్రా, హీరో మోటార్స్, లార్సెన్, విప్రో వంటి కంపెనీలు స్వల్ప నష్టాల్లో నడుస్తున్నాయి. ఇక డాలర్ తో రూపాయి విలువ రూ.68.63 దగ్గర ఉంది.

Posted in Uncategorized

Latest Updates