స్టార్టప్ సమ్మిట్ : హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ సదస్సు

richదేశంలో స్టార్టప్ అభివృద్ధిని పెంచాలనే ఉద్దేశంతో మరిన్ని ప్రణాళికలను రచిస్తున్నాయి ప్రాంచైజీలు. ఈ క్రమంలోనే హైదరాబాద్ వేదికగా మే-19,20 తేదీల్లో మరో ప్రతిష్ఠాత్మక జాతీయసదస్సు జరుగనున్నది. హైదరాబాద్‌ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌ లో స్టార్టప్ సమ్మిట్ ఎక్స్‌పో 2018ను శని, ఆది వారాల్లో నిర్వహించనున్నారు. ఈ ఎక్స్‌ పోకు దేశవ్యాప్తంగా ఉన్నవే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దేశాల స్టార్టప్‌ ల ప్రతినిధులు హాజరుకానున్నారు.

దేశంలో స్టార్టప్ సంస్కృతిని పెంపొందించడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఆవిష్కరణలను వ్యాపారబాట పట్టించడం, మహిళా ఆవిష్కర్తలు ఎదిగేందుకు గల అవకాశాలు అన్వేషించడంతోపాటుగా మరెన్నో అంశాలు విపులంగా చర్చించనున్నారు. ఫ్రాంచైజీ ఇండియా సంస్థ నిర్వహిస్తున్న ఈ సదస్సుకు టై హైదరాబాద్, ఓయో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆవిష్కరణల కేంద్రమైన రిచ్ ..రీసెర్స్ ఆండ్ ఇన్నోవేషన్ సర్కిల్ సపోర్టింగ్ పార్ట్‌ నర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఈ సమ్మిట్‌ కు దేశవిదేశాల స్టార్టప్ సంస్థల ప్రతినిధులతో పాటుగా, విధానకర్తలు, ఇతర రంగాల నిపుణులు హాజరుకానున్నారు.

Posted in Uncategorized

Latest Updates