స్టార్స్ మీటింగ్ : కేటీఆర్ తో మమ్ముట్టి భేటీ

మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి.. మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. జూలై 20వ తేదీ శుక్రవారం ఉదయం సీఎం క్యాంప్ ఆఫీస్ కు వచ్చిన హీరో.. ఓ మొక్కును అందజేశారు. జూలై 25వ తేదీ హైదరాబాద్ లో జరిగే కైరారీ పీపుల్ ఇన్నోటెక్ అవార్డ్స్ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా వ్యవహరించాలని మంత్రి కేటీఆర్ ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా మమ్ముట్టీతో కొద్దిసేపు చర్చించారు మంత్రి. ఇన్నోటెక్ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. దీనిపై మమ్ముట్టి కొద్దిసేపు ప్రజంటేషన్ కూడా ఇచ్చారు. మమ్ముట్టి ఆహ్వానాన్ని మన్నించిన మంత్రి కేటీఆర్.. ఫంక్షన్ కు వస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా మమ్ముట్టీకి చార్మినార్ ను బహుమతిగా అందజేశారు కేటీఆర్.

కొన్నాళ్లుగా హైదరాబాద్ లోనే ఉంటున్న మమ్ముట్టి.. వైఎస్ఆర్ బయోపిక్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇటీవలే విడుదల అయిన ఫస్ట్ లుక్, టీజర్ సంచలన రికార్డ్స్ క్రియేట్ చేసింది. అచ్చం వైఎస్ రాజశేఖర్ రెడ్డిలాగే ఉన్నారంటూ మమ్ముట్టీకి అభినందనలు వెల్లువెత్తాయి. వైఎస్ఆర్ బయోపిక్ పై కేరళీయులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం మహానటి ఆడియో ఫంక్షన్ సందర్భంగా మమ్ముట్టి కుమారుడు దుల్కన్ సల్మాన్ సందడి చేసిన సంగతి తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates