స్టార్ బ్రాండ్ : IPL బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్

ipl-ntrఐపీఎల్ క్రికెట్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్ వ్యవహరించనున్నారు. ఈసారి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ల ప్రసార హక్కులను స్టార్ గ్రూప్ సొంతం చేసుకుంది. ఈ గ్రూప్ కి భారతదేశంలోని వివిధ భాషల్లో ఛానల్స్ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఒక్కో రాష్ట్రానికి ఒక్కో హీరోని బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకుంది. ఇందులో భాగంగా తెలుగులో ఎన్టీఆర్ తో ఒప్పందం చేసుకుంది.

ఐపీఎల్ మ్యాచ్ లను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసేందుకు ఎన్టీఆర్ తో యాడ్స్ రూపొందించి విడుదల చేయాలని నిర్ణయించింది. లీగ్ ఆరంభం నుంచి ఈ ప్రమోషన్ మొదలుపెట్టనుంది కంపెనీ. దీనికి సంబంధించి షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. క్రికెట్ మ్యాచ్ కామెంట్రీని కూడా తెలుగులోనే ఇవ్వనున్నారు. ఈ మ్యాచ్ లు జరిగినన్ని రోజులూ ఎన్టీఆర్ ప్రమోషన్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 7వ తేదీ ముంబైలోని వాంఖడే స్టేడియోలో ఆరంభ వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి కూడా ఎన్టీఆర్ హాజరుకానున్నట్లు సమాచారం.

 

Posted in Uncategorized

Latest Updates