స్టీల్ ప్లాంట్ అంశంలో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు : కన్నా

కడప  స్టీల్  ప్లాంట్ , దుగరాజపట్నం   పోర్టు రావడం  చంద్రబాబుకు  ఇష్టం లేదని  ఆరోపించారు  ఏపీ బీజేపీ చీఫ్  కన్నా లక్ష్మీనారాయణ. ఇష్టంలేకే  వాటి గురించి  సమాచారం కేంద్రానికి   ఇవ్వలేదన్నారు. స్టీల్ ప్లాంట్ అంశాన్ని చంద్రబాబు  రాజకీయంగా  వాడుకుంటున్నారన్నారు.  స్టీల్ ప్లాంట్ పై  చిత్తశుద్ధి  ఉంటే… నిర్వాసితుల  వివరాలు, ఇతర సమాచారం  కేంద్రానికి ఎందుకు  సమర్పించలేదని  నిలదీశారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు  ఫీజిబిలిటీ  లేదని  సెయిల్  చెప్పినా,  రాయలసీమ వెనుకబడిన  ప్రాంతం కావడంతో  కేంద్రం అంగీకరించిందన్నారు  కన్నా లక్ష్మీనారాయణ.

 

Posted in Uncategorized

Latest Updates