స్టీల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకై ఆరుగురి మృతి

ఏపీ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. తాడిపత్రిలోని గెరుడౌ స్టీల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకై ఆరుగురు చనిపోయారు. ఈ ఘటనలో మరో నలుగురు అస్వస్థతకు గురయ్యారు. కార్మికులందరూ.. పనిలో నిమగ్నమై ఉండగా జూలై 12వ తేదీ గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో గ్యాస్ లీకైంది. కార్బన్‌ డై ఆక్సైడ్ వాయువు ఎక్కువ శాతంలో లీక్ అవడంతో అక్కడున్న కార్మికులకు ఆక్సిజన్ అందలేదు. దీంతో ఊపిరాడక ఆరుగురు కార్మికులు మృతి చెందారు. మృతుల్లో రంగయ్య, గంగాధర్, మనోజ్, వసీం, లింగయ్య, గురవయ్య ఉన్నారు. అస్వస్ధతకు గురైన వారిని ట్రీట్ మెంట్ కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కార్మికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates