స్టూడెంట్సా..రౌడీలా : బ్లేడుతో దాడి.. 35 కుట్లు పడ్డాయి

స్కూల్లో విద్యార్థులు రౌడీల్లా రెచ్చిపోయారు. తోటి విద్యార్థిని బ్లేడుతో కోయడంతో ఆ స్కూడెంట్ కి 35 కుట్లు పడ్డాయి. ఈ సంఘటన శనివారం (జూలై-14) దేశరాజధాని ఢిల్లీలో జరిగింది.  ఢిల్లీలోని బాదార్‌పూర్‌ లో గల కేంద్రీయ విద్యాలయంలో.. ఏడో తరగతి విద్యార్థుల మధ్య క్లాస్‌ రూమ్‌లో సీటు విషయంలో వాగ్వాదం జరిగింది. రఫీ అనే విద్యార్థి కూర్చున్న సీటు తనకు ఇవ్వాల్సిందిగా మరో విద్యార్ధి బెదిరించాడు.

దీనికి రఫీ తిరస్కరిచండంతో..లంచ్ సమయంలో ..ఆ విద్యార్ధి స్నేహితులతో కలిసి వాష్‌ రూమ్‌ లో  ఉన్న రఫీపై బ్లాడ్స్‌తో తీవ్రంగా దాడిచేశారు. ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడడంతో.. పాఠశాల యాజమాన్యం అక్కడే ప్రథమ చికిత్సను అందించింది. తీవ్ర రక్తస్రవం అవ్వడంతో స్కూల్‌ యాజమాన్యం అతన్ని ఢిల్లీలోని ఎయియ్స్‌ కి తరలించారు. విద్యార్థి వీపు భాగంలో బ్లేడ్‌ తో తీవ్రంగా గాయపర్చడం వల్ల 35 కుట్లు వేసినట్లు తెలిపారు ఎయియ్స్‌  డాక్టర్లు.  తనను విద్యార్థులు బెదిరిస్తున్నట్లు రఫీ స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా,, వారు పటించుకోలేదని బాలుడి కుటుంబ సభ్యులు తెలిపారు.  ఘటనలో పాల్గొన్న అందరూ మైనర్లే కావడం వల్ల పోలీసులు ఇప్పటి వరకూ ఎలాంటి కేసు నమోదు చేయలేదు.

 

 

Posted in Uncategorized

Latest Updates