స్టూడెంట్సే టార్గెట్ : వాట్సాప్ గ్రూపుల్లో సీక్రెట్ కోడ్స్..గంజాయి ముఠా అరెస్ట్

JANJAనేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదం అందరికీ తెలిసిందే. అయితే చదువుకునే వయసులోనే విద్యార్థులు పక్కదారి పట్టడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చదువుకునే పిల్లల్ని ఆసరాగా చేసుకుని ..గంజాయి వ్యసనాలకు దింపుతున్నా కొన్ని గంజాయి ముఠాలు. స్టూడెంట్పే వారి టార్గెట్. చక్కగా చదువుకోవాల్సిన  టీనేజీ కుర్రాళ్లు.. గంజాయికి బానిసలయ్యారు. కర్ణాటక నుంచి గంజాయిని అక్రమ రవాణా చేస్తున్న కేటుగాళ్లు విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారు.

ప్రత్యేక అడ్డాలు ఏర్పాటు చేసి, యువతకు నిషాతో కిక్కెకిస్తున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు పెడలర్లను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా.. జహీరాబాద్‌ స్కూల్స్ లోని  9, 10వ తరగతి విద్యార్థులే లక్ష్యంగా గంజాయి అమ్మకాలు చేస్తున్నట్లు తేలింది.  ఇప్పటి వరకు మొత్తం 47 మంది విద్యార్థులను గంజాయి మత్తులోకి దింపినట్లు వారు అంగీకరించారు. ఈ విషయంతో అవాక్కైన పోలీసులు.. తల్లిదండ్రులు సహా ఆ విద్యార్థులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. గంజాయి మత్తుతో కలిగే అనర్థాలను వివరించారు. 3రోజుల కిందట జహీరాబాద్‌ పట్టణంలో జరిగిన ఈ ఘటన.. తల్లిదండ్రులను తీవ్రంగా కలచి వేసింది. ఈ కేసులో కర్ణాటకలోని బీదర్‌ కు చెందిన సయ్యద్‌ షానవాజ్‌ హుస్సేన్‌, జహీరాబాద్‌ కు చెందిన మోమిన్‌ మొహిల్లా, జమీల్‌ అహ్మద్‌ ను గురువారం (జూన్-14) అరెస్ట్‌ చేశారు. కాసులకు కక్కుర్తిపడే కేటుగాళ్లు.. టీనేజీ కుర్రాళ్లకు మత్తు మజాను రుచి చూపిస్తున్నారు. మొదట తక్కువ ధరకే గంజా యి అందిస్తున్నారు. కుర్రాళ్లను దానికి బానిసలను చేసిన తర్వాత ఇష్టానుసారం ధరను పెంచేసి సొమ్ము చేసుకుంటున్నారు.

వాట్సాప్‌ గ్రూప్‌ లు.. కోడ్‌లు

తెలంగాణలో ఇటీవల చిక్కిన గంజాయి ముఠాలు వాట్సా్‌పలో గ్రూప్‌లు సృష్టించి దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే, గంజాయి విక్రయానికి కోడ్‌ భాషను ఉపయోగిస్తున్నారు. గంజాయి కొనడాన్ని స్కోర్‌ గా పిలుస్తారు. మెటీరియల్‌, స్టఫ్‌ వంటి పదాలను ఉపయోగిస్తున్నారు. రాచకొండ పరిధిలో 2 నెలల కిందట పట్టుబడ్డ ఒక ముఠా.. గ్రీన్‌ కోడ్‌ అనే వాట్సాప్‌ గ్రూప్‌ ను క్రియేట్‌ చేసింది. ఇంజనీరింగ్‌ విద్యార్థులే లక్ష్యంగా అమ్మకాలు జరిపింది. గ్రీన్‌ గంజా, ఫ్రెష్‌ గంజా, బ్రౌన్‌ గంజా వంటి పేర్లతో విద్యార్థులకు మత్తును అలవాటు చేసింది.

ఈ దందా కర్ణాటక సరిహద్దు పట్టణాలైన నారాయణఖేడ్‌, జహీరాబాద్‌, తాండూరు, పరిగి, వికారాబాద్‌, సంగారెడ్డి తదితర పట్టణాల్లో జోరుగా సాగుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కర్ణాటక-తెలంగాణ సరిహద్దులోని మన్నెకెళ్లి, భంగూ రు, చించోలిల్లో తక్కువ ధరకు ఎండు గంజాయిని కొనుగోలు చేసిన పెడలర్లు.. దాన్ని పొట్లాలుగా చేసి, ఇక్కడ అమ్మకాలు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. హైదరాబాద్‌ కే పరిమితమైన గంజాయ్‌ గుప్పు.. ఇప్పుడు శరవేగంగా రాష్ట్రంలోని పట్టణాలకు విస్తరిస్తోందని దీనిపై సమాచారం తెలిసినవారు పోలీసులకు తెలపాలని సూచించారు పోలీసు ఉన్నతాధికారులు.

 

 

 

 

Posted in Uncategorized

Latest Updates