స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్ : ఈ స్టడీ ఇయర్ నుంచి హెల్త్ కార్డులు

kadiyam21022018-19 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని 30 లక్షల మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేసి హెల్త్ కార్డులు అందించాలని తెలంగాణ మంత్రులు కడియం, లక్ష్మారెడ్డి నిర్ణయించారు. జూలై నుంచి ఆరోగ్య పరీక్షలు ప్రారంభించి ఆరు నెలల్లో పూర్తి చేసి హెల్త్ కార్డులు ఇవ్వాలని అధికారులకు సూచించారు. దీంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విద్యాశాఖ గురుకుల విద్యాలయాలు, కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లోని 8 లక్షల మంది విద్యార్థినులందరికీ హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ ఇవ్వాలని నిర్ణయించారు.

ఇప్పటికే కేజీబీవీలు, గురుకుల విద్యాలయాలు, మోడల్ స్కూళ్లలోని 3 లక్షల మందికి విద్యాశాఖ హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ అందిస్తోందని కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డి తెలిపారు. హెల్త్ కిట్స్ లో అందిస్తున్న వస్తువులను కూడా మంత్రి లక్ష్మారెడ్డికి, అక్కడున్న ఆరోగ్యశాఖ అధికారులకు చూపించారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి విద్య, వైద్యారోగ్య శాఖల సమన్వయంతో ఈ ఆరోగ్య పరీక్షలు జరపాలని, హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ ఇవ్వాలని బుధవారం (ఫిబ్రవరి-21)న సచివాలయంలో జరిగిన సమావేశంలో ఇద్దరు మంత్రులు నిర్ణయించారు.

Posted in Uncategorized

Latest Updates