స్టూడెంట్స్ కోసం..మహీంద్రా టాలెంట్​ స్కాలర్​షిప్

పదోతరగతి, ఇంటర్​ ఉత్తీర్ణులై ప్రస్తుతం పాలిటెక్నిక్‌‌లో చేరిన స్టూడెంట్స్​ కు ఉపకార వేతనాలు అందించేందుకు మహీంద్రా అండ్​ మహీంద్రా లిమిటెడ్​కు చెందిన కేసీ మహీంద్రా ఎడ్యుకేషన్​ ట్రస్ట్​ ముందుకొచ్చింది. ఇందుకుగాను మహీంద్రా ఆల్​ ఇండియా టాలెంట్​ స్కాలర్​షిప్​ (ఎంఏఐటీఎస్​)​ పేరుతో నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఆఫ్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం 550 స్కాలర్‌‌‌‌షిప్స్​ అందుబాటులో ఉన్నాయి. ఎంపికయిన అభ్యర్థులకు మూడేళ్ల పాటు సంవత్సరానికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సహకారం అందిస్తారు. ఇందుకు పరీక్ష లేదు. మెరిట్​, ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు.

అర్హత‌‌: కనీసం 60 శాతం మార్కుల‌‌తో ప‌‌దోత‌‌ర‌‌గ‌‌తి లేదా ఇంట‌‌ర్మీడియ‌‌ట్ పూర్తి చేసి ప్రస్తుతం (2019–20) ఏదైనా పాలిటెక్నిక్​ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం పొంది ఉండాలి. బాలికలు, పూర్​ ఫ్యామిలీకి చెందిన పిల్లలు​, దివ్యాంగుల పిల్లలు, డిఫెన్స్​ లో పనిచేసే వారి పిల్లలకు ప్రాధాన్యత ఉంటుంది.

సెలెక్షన్ ప్రాసెస్: అర్హులైన అభ్యర్థులను షార్ట్​లిస్ట్​ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో మెరిట్​ సాధించిన వారిని ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు అవసరమైన రవాణా ఖర్చులు అభ్యర్థులకు చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: వెబ్​సైట్‌‌లో అప్లికేషన్​ డౌన్​లోడ్​ చేసుకొని పూర్తి వివరాలు నింపి సంబంధిత సర్టిపికెట్లు జతచేసి సంస్థ చిరునామాకు గడువుతేదీలోగా పంపాలి. ఏపీ, తెలంగాణ నుంచి దరఖాస్తు చేసేవారు దరఖాస్తులు కింద తెలిపిన అడ్రస్​కు పంపాలి.

దరఖాస్తుకు చివ‌‌రితేది: 2019 ఆగస్టు 22

అడ్రస్​: ద కో ఆర్డినేట‌‌ర్‌‌, మ‌‌హీంద్రా అండ్ మ‌‌హీంద్రా లిమిటెడ్‌‌, మ‌‌హీంద్రా హౌస్‌‌, ఆటోసెక్టార్‌‌, టిఎస్‌‌ రెడ్డి కాంప్లెక్స్‌‌, 1-7-1, పార్క్ లేన్‌‌, ఎస్​డి రోడ్‌‌, సికింద్రాబాద్ – 500 003

వెబ్​సైట్​: www.kcmet.org

Latest Updates