స్టూడెంట్స్ ని అవమానిస్తారా : రిటైర్మెంట్ రోజున టీచర్లకు సమాధులు

NEHRU మార్చి 2016లో కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ గవర్నమెంట్ విక్టోరియా కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ టీఎన్ సరసు రిటైర్ అవుతున్నారు. ఆమెకు గ్రౌండ్ గా వీడ్కోలు చెప్పాలని భావించిన స్టూడెంట్స్.. కాలేజీ ఆవరణలో సమాధి కట్టారు. ఓ లేఖ కూడా ఉంచారు. మీ గొప్ప సేవలకు ధన్యవాదాలు. 26 సంవత్సరాల ఎపిసోడ్ ముగిసిందంటూ రాశారు. దీనిపై స్పందించిన ప్రిన్సిపల్ టిఎన్ సరసు.. రిటైర్మెంట్ రోజున స్టూడెంట్స్ ఈ విధంగా చేయడం చూసి షాక్ అయ్యాను. ఇది తనను తీవ్రంగా బాధపెడుతుంది అన్నారు. సరసు ఇచ్చిన కంఫ్లెయింట్ తో రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు  స్టూడెంట్స్ ను అరెస్ట్ చేశారు.
జనవరి 2017లో అబ్బాయిలను ఆనందంగా ఉంచేందుకే అమ్మాయిలు స్కూల్ కి వస్తారన్న మహారాజ కాలేజీ ప్రిన్సిపల్ NL బీనా వ్యాఖ్యలు చేయడంతో SFI కార్యకర్తలు, కొంతమంది టీచర్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె సెలవులో ఉన్న సమయంలో క్యాంపస్ లో దిష్ఠిబొమ్మలు దగ్ధం చేశారు.

సరిగ్గా రెండేళ్ల తర్వాత కాసర్ గూడలోని నెహ్రూ కాలేజీలో అలాంటి ఘటనే మళ్లీ జరిగింది. విద్యార్ధుల గురించి వ్యంగ్యంగా మాట్లాడినందుకు ప్రిన్సిపల్ పీవీ పుష్పజ రిటైర్ అయ్యే రోజు (మార్చి 27) క్యాంపస్ లో ఆమె సమాధి కట్టారు స్టూడెంట్స్. విద్యార్ధుల హృదయాల్లో చనిపోయిన ప్రిన్సిపల్ కు మా నివాళులని లేఖ రాశారు. కొంత మంది స్టూడెంట్స్ ఆ రోజున స్కూల్ లోని అందరికీ స్వీట్లు పంచి.. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవడంతో ఏప్రిల్ 4 బుధవారం ఆమె హొస్ దుర్గ్ పోలీస్ స్టేషన్ లో కంఫ్లెయింట్ చేశారు. విద్యార్ధులు చేసిన ఆ పని తనను ఎంతగానో భాధించిందని తెలిపారు. ఈ విషయంపై అసెంబ్లీలోనూ స్పందించారు కేరళ సీఎం పిన్నరాయి విజయన్. మహిళలపై ఇలాంటి ఘటనలు ఆమోదయోగ్యం కావని సలహా ఇచ్చారు. ఇది వేధింపుల కన్నా ఎక్కువని అభిప్రాయపడ్డారు.

Posted in Uncategorized

Latest Updates