స్కూళ్లలో తుపాకులు.. స్టూడెంట్స్ సెక్యూరిటీ కోసం

అమెరికాలో కొందరు ఇష్టానుసారంగా కాల్పులకు పాల్పడుతూ… అమాయక ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్నారు. దీంతో అక్కడి ప్రజలకు భద్రత లేకుండా పోతోంది. ముఖ్యంగా విద్యాసంస్థలను టార్గెట్ గా చేసుకుని కాల్పులకు పాల్పడుతున్నారు. దీంతో స్టూడెంట్స్ సెక్యూరిటీ కోసం స్కూ ళ్లలోకి తుపాకులు అనుమతించాలని అమెరికా ప్రభుత్వానికి స్కూల్‍ సేఫ్టీ ప్యానెల్‍ సూచించింది.

స్కూళ్లలో కాల్పులు జరుగుతున్న ఘటనలు పెరిగిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. టీచర్లతో సహా సిబ్బందికి ఆయుధాలివ్వాలని, అనుభవజ్ఞులను గార్డులుగా నియమించుకోవాలని చెప్పింది. గతేడాది ఫిబ్రవరిలో ఫ్లోరిడాలోని పార్క్ లాండ్‍లో మాజీ విద్యార్థి జరిపిన కాల్పుల్లో 17 మంది చనిపోయారు. దీంతో వెపన్స్ విచ్చల విడి అమ్మకాలను అరికట్టాలంటూ ఆందోళనలు జరిగాయి. ఆ తర్వాత ప్రభుత్వం ఎడ్యుకేషన్ సెక్రెటరీ బెట్సీ దేవోస్‍ ఆధ్వర్యంలో ఫెడరల్‍ కమిషన్‍ ఆన్‍ సేఫ్టీప్యానెల్‍ను ఏర్పాటు చేసింది. స్కూల్‍ సేఫ్టీ ప్యానెల్‍ 180 పేజీల రిపోర్టును రూపొందించింది. తుపాకుల కొనుగోలుకు ప్రస్తుతం ఉన్న కనీస వయసును పెంచాలనే డిమాండ్‍ను తిరస్కరించింది. కాల్పులు జరిపిన వారిలో చాలా మంది కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్ నుంచి తుపాకులు దొంగిలించిన వారేనని చెప్పింది. ఫైరింగ్ చేసే వారిని తెలివిగా , వేగంగా ఎలా ఎదుర్కోవాలో టీచర్లకు, సిబ్బంది ట్రైనింగ్ ఇచ్చి.. ఆయుధాలు ఇవ్వాలని సూచించింది. రూరల్‍ ఏరియాల్లో పోలీసులు వెంటనే స్పందించలేరని, అలాంటి ప్రాంతాల్లో సిబ్బందికి వెపన్స్ ఇవ్వడమే మంచిదని చెప్పింది. అలాగే మాజీ పోలీసు, మిలటరీ అధికారులను గార్డులుగా నియమించుకోవాలని సూచించింది.

 

Posted in Uncategorized

Latest Updates