స్టూడెంట్ నుంచి..సూసైడ్ బాంబర్ గా

శ్రీ నగర్: ఆదిల్​ అహ్మద్​దార్ అలియాస్ వకాస్. పుల్వామా ఆత్మాహుతి దాడికి పాల్పడిన జైషే ఉగ్రవాది. స్కూల్ , కాలేజీలో సిగ్ గు , బిడియం కలిగిన స్టూడెంట్​గా ఉన్న ఆదిల్.. సూసైడ్ ​బాంబర్​గా ఎలా మా రాడు ? ఇంత మందిని ఎలా పొట్టనబెట్టుకున్నాడు.  ఆదిల్​ యావరేజ్ ​స్టూడెంటే అనేది అతని స్నేహితులు చెబుతున్న మాట.

స్కూల్​లో చాలా సిగ్గుపడుతూ ఉండే వాడని, గేమ్స్​లో కూడా ఎక్కువగా పార్టిసిపేట్ ​చేసేవాడు కాదని వారు చెబుతున్నారు. క్లాస్ రూమ్ లో తనపని తనది అన్నట్టుగా ఉండే వాడని, 12 తరగతి మధ్యలోనే ఆపేశాడని తెలిపారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం 2018 మార్చిలో ఆదిల్​ జైషే మహ్మద్​లో చేరాడు. దక్షిణ కాశ్మీర్​లోని పుల్వామా జిల్లా, కాకాపొర మండలం,  గ్రామం  గాంధీబాఘ్.. ఆదిల్ ​స్వస్థలం. ఇది దాడి జరిగిన అవంతిపురకు పది కిలోమీటర్ల దూరంలోనే ఉంది.

2018 మార్చి 21న అతడు మరికొందరు కాశ్మీరీ యువకులతో కలసి జైషేలో జాయిన్ ​అయ్యాడు. భద్రతా బలగాలపై తీవ్రదా డులకు పాల్పడేలా ట్రైనింగ్​ తీసుకుని అత్యంత క్రూరమైన టెర్రరిస్టుగా వీరంతా మారారు. అతడు జైషేలో చేరిన మూడు నెలల తర్వాత గత ఏడాది జూన్​లో భద్రతా బలగాలు ఆదిల్​ నివాసాన్ని నేల కూల్చేశాయి. ఆ తర్వాత భారీ డోర్​టూ డోర్​సెర్చ్​ఆపరేషన్​మొదలుపెట్టి ఉగ్రవాదల ఏరివేత మొదలు పెట్టాయి. అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. మూడు దశాబ్దాల్లో రెండో భీకర దాడికి జైషే తెగబడింది. జవాన్ల మరణాల పరంగా చూస్తే ఇది అతిపెద్ద అటాక్.

Latest Updates