స్టెప్పులతో IPL కు స్వాగతం పలికిన కోహ్లీ టీం

kohliమరో మూడు రోజుల్లో స్టార్ట్ అవనున్న IPL-11 సీజన్‌ కోసం క్రికెట్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక మెగా సమరానికి అన్నీ జట్లు ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టాయి. మరో వైపు ఆయా జట్ల ఫ్రాంఛైజీల ఫొటో షూట్లలో పాల్గొంటున్నారు. కేవలం ఆటతోనే కాకుండా స్టెప్పులేసి మరీ అభిమానులను ఆకట్టుకోవడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఆటగాళ్లు సిద్ధమయ్యారు. IPL కోసం లెజెండ్స్‌తో వార్మప్‌ మొదలెట్టేశానంటూ కోహ్లి, మెక్‌కల్లమ్‌ ను ట్యాగ్‌ చేస్తూ 12 సెకన్ల డాన్స్‌ వీడియోను చాహల్‌ ట్విట్టర్ లో పోస్ట్‌ చేశాడు. ఈ వీడియోలో కోహ్లి తన స్టెప్పులతో రెచ్చిపోగా మెక్‌కల్లమ్‌, చాహల్‌లు అతన్ని అనుకరించే ప్రయత్నం చేశారు. డ్యాన్స్‌ చేస్తుండగా మధ్యలో చాహల్‌ నవ్వు ఆపుకోలేకపోయాడు. చాహల్‌ను చూసిన కోహ్లీ కూడా ఒక్కసారిగా నవ్వేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా ఆటగాళ్ల డ్యాన్స్‌ చూసి నవ్వు ఆపుకోలేకపోతున్నారు.

Posted in Uncategorized

Latest Updates