స్టేషన్ లో కౌంటర్ : మెట్రో రైల్ IPL నైట్ సర్వీసులు

metroఏప్రిల్, మే నెలల్లో హైదరాబాద్ లో జరిగే IPL మ్యాచ్ ల కోసం మెట్రో సిద్దమైంది. ఇప్పటి వరకూ రాత్రి 10 గంటల వరకూ పరుగులు తీసే మెట్రో రైలు IPL మ్యాచ్ ల సందర్భంగా అర్ధరాత్రి 12:30 గంటల వరకూ సర్వీసులు నడపనుంది. IPL మ్యాచ్ టికెట్లను మియాపూర్, మూసాపేట, అమీర్ పేట, హబ్సి గూడ, ముసారాంబాగ్, పంజాగుట్ట దగ్గరున్న హైదరాబాద్ నెక్ట్స్ మాల్స్, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ల దగ్గర నుంచి టికెట్లు కొనుగోలు చేయవచ్చు. ఈవెంట్ షో డాట్ కామ్ ద్వారా బుక్ చేసుకున్న టికెట్లను ఇక్కడ పొందవచ్చని HMR మెట్రో రైల్ తన ట్వీట్ లో తెలిపింది.

ఎక్కువమంది ప్యాసింజర్లు ఈ సర్వీసులను ఉపయోగించుకోవడానికి రైళ్ల ఫ్రీక్వెన్సీని కూడా పెంచాలని అధికారులు ఆలోచిస్తున్నారు. దీనికి సంబంధించిన డేటాను, సర్టిఫికెట్లను ఇప్పటికే పైల్ సేఫ్టీ కమీషనర్ కు అందించడం జరిగిందని అధికారులు తెలిపారు. మెట్రో రైల్ ప్రారంభించిన రోజు నుంచి 100 రోజుల మెట్రో జర్నీ వరకు 80 లక్షల మంది మెట్రో సేవలను వినియోగించుకున్నారు. ఫిబ్రవరి చివరి నాటికి 10.2 లక్షల కిలోమీటర్ల ఆపరేషన్స్ జరిగిందన 36వేల 816 ట్రిప్ లు మెట్రో పూర్తి చేసిందని అధికారులు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates