స్టే ఎత్తివేసిన హైకోర్టు : మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు లైన్ క్లీయర్

mallannaతెలంగాణలోని భూములన్నీ ప్రాజెక్టుల నీటితో సస్యశ్యామంలో చేయలని ప్రభుత్వం చేపట్టిన మల్లన్న సాగర్‌ ప్రాజెక్టుకు లైన్ క్లీయర్ అయ్యింది. శుక్రవారం (జూన్-15) మల్లన్నసాగర్ ప్రాజెక్టు పనులకు లైన్‌ క్లియర్‌ చేసింది హైకోర్టు. సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన స్టేను డివిజన్‌ బెంచ్‌ ఎత్తివేసింది. ప్రాజెక్టు పనులను కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది.  కొత్త ప్రాజెక్టులు చేపట్టడంతో పాటు పలు ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేసి.. పనులను వేగవంతం చేశారు.

అందులో భాగంగానే మల్లన్న సాగర్ ను రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. సాధ్యమైనంత త్వరగా రైతులకు సాగునీరు అందిచేందుకు సర్కార్ ప్రయత్నిస్తుంటే.. కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఉపాధి కోల్పోతున్న కారణంగా ప్రాజెక్టు ఆపాలంటూ పిటిషన్ వేశారు. దీంతో సింగిల్‌ బెంచ్‌ స్టే ఇచ్చింది. ఈ స్టేపై అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ రామచందర్‌రావు డివిజన్‌ బెంచ్‌లో వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే పిటిషనర్లపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పునరావాసంపై పిటిషనర్లకు ఆసక్తి లేదని వ్యాఖ్యానించింది. కేవలం ప్రాజెక్టును ఆపేందుకే కోర్టులను ఆశ్రయిస్తున్నారని మండిపడింది. ప్రాజెక్టు పనులను కొనసాగించుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మల్లన్న సాగర్ పనులకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌ ఇవ్వడాన్ని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ స్వాగతించారు. ఆర్‌ అండ్ ఆర్ ముసుగులో ప్రాజెక్టులను అడ్డుకునే చర్యలపై హైకోర్ట్ సీరియస్ కావడం శుభపరిణామం అన్నారు. ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు ఈ తీర్పుచెంపపెట్టులాంటిదని తెలిపారు . ప్రాజెక్టుల నిర్మాణం కోసం తెలంగాణ సర్కారు చేస్తున్న ప్రయత్నాలకు.. మల్లన్న దేవుడి ఆశీస్సులు లభించాయన్నారు మంత్రి హరీష్.

Posted in Uncategorized

Latest Updates