స్ట్రీమింగ్‌ క్వాలిటీ తగ్గించండి

స్ట్రీమింగ్‌ క్వాలిటీ తగ్గించండి
12 ఓటీటీలకు టెల్కోల రిక్వెస్ట్‌

న్యూఢిల్లీకరోనా వైరస్‌‌‌‌ వల్ల చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. చిరు వ్యాపారులు, ఉద్యోగులు లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ వల్ల ఇళ్లకే పరిమితమవుతున్నారు. విద్యాసంస్థలకు సెలవులు కాబట్టి స్టూడెంట్స్ ఇంటిపట్టునే ఉంటున్నారు. ఎక్కువ మంది గుమిగూడవద్దని ప్రభుత్వం చెప్పింది కాబట్టి ప్రతి ఒక్కరూ మొబైల్స్‌‌‌‌, ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌, ట్యాబ్లెట్స్‌‌‌‌, గేమింగ్‌‌‌‌ కన్సోల్స్‌‌‌‌, టీవీలకు అతుక్కుపోతున్నారు. పట్టణాల్లో అయితే మెజారిటీ జనం వీటితోనే టైంపాస్‌‌‌‌ చేస్తున్నారు. ఎక్కువ మంది ఫోన్లలో, స్మార్ట్‌‌‌‌టీవీల్లో సినిమాలను, టీవీ షోలను చూస్తున్నారు. మరికొందరు యూట్యూబ్‌‌‌‌ లవర్స్‌‌‌‌! ఇప్పుడు డేటా చౌక కాబట్టి అందరూ హై క్వాలిటీ వీడియోలను ఎంచుకుంటున్నారు. దీంతో టెల్కోలు, బ్రాడ్‌‌‌‌బ్యాండ్‌‌‌‌ సర్వీస్‌‌‌‌ ప్రొవైడర్ల నెట్‌‌‌‌వర్కులపై లోడ్‌‌‌‌ పెరుగుతోంది. సర్వర్లు తరచూ ఇబ్బందులపాలవుతున్నాయి. అందుకే వీడియో స్ట్రీమింగ్‌‌‌‌ క్వాలిటీ తగ్గించాలని నెట్‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌, అమెజాన్‌‌‌‌ ప్రైమ్‌‌‌‌, జీ5, ఆల్ట్‌‌‌‌ బాలాజీ, హాట్‌‌‌‌స్టార్‌‌‌‌, యూబ్యూబ్‌‌‌‌ వంటి ఓవర్‌‌‌‌ ది టాప్‌‌‌‌ (ఓటీటీ) స్ట్రీమింగ్‌‌‌‌ సర్వీసు కంపెనీలను కోరాయి.

డాట్‌‌‌‌కు లెటర్‌‌‌‌ రాసిన సీఓఏఐ

ఈ విషయమై సెల్యులార్‌‌‌‌ ఆపరేటర్స్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఇండియా (సీఓఏఐ) జనరల్‌‌‌‌ సెక్రటరీ రాజన్‌‌‌‌ మాథ్యూస్‌‌‌‌ మాట్లాడుతూ ఓటీటీ, స్ట్రీమింగ్‌‌‌‌ సర్వీసు ప్రొవైడర్లంతా డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌/స్ట్రీమింగ్‌‌‌‌ క్వాలిటీని హెచ్‌‌‌‌డీ నుంచి స్టాండర్డ్‌‌‌‌ డెఫినిషన్‌‌‌‌కు తగ్గించాలని కోరారు. దీనివల్ల తక్కువ డేటా ఖర్చవుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌‌‌‌ సేవలు కొనసాగడం తప్పనిసరి కాబట్టి టెల్కోలు, ఓటీటీ కంపెనీలు కలిసి పనిచేయాలని కోరారు. ఇదే విషయమై డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ టెలికామ్‌‌‌‌కు (డాట్‌‌‌‌) లెటర్ కూడా రాశామని చెప్పారు. ఇదిలా ఉంటే, యూరప్‌‌‌‌ వంటి దేశాల్లో ఇది వరకే యూట్యూబ్‌‌‌‌, నెట్‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌ వంటివి స్ట్రీమింగ్‌‌‌‌ క్వాలిటీని తగ్గించాయి. మనదేశంలో గత కొన్ని రోజులుగా యూజర్ల నెట్‌‌‌‌ వాడకం ఏడుశాతం పెరిగినట్టు స్టడీ రిపోర్ట్స్‌‌‌‌ చెబుతున్నాయి. ఈ విషయమై నెట్‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌, ఎంఎక్స్‌‌‌‌ ప్లేయర్స్‌‌‌‌ కంపెనీలు స్పందిస్తూ తాము ఇది వరకే స్ట్రీమింగ్‌‌‌‌ క్వాలిటీని హెచ్‌‌‌‌డీ నుంచి ఎస్‌‌‌‌డీకి తగ్గించామని తెలిపాయి. మిగతా ఓటీటీ ప్రొవైడర్లు స్ట్రీమింగ్‌‌‌‌ క్వాలిటీని తగ్గించే అవకాశాలు ఉన్నాయి.

Latest Updates