స్థలం కబ్జా చేశారని.. మహిళ ఆత్మహత్యాయత్నం

WOMEN SUCIDE ATEMPTరాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు ఓ మహిళ  ఆత్మహత్యాయత్నం చేసింది. కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్మన్ కనకయ్య.. తన ఇంటిస్థలాన్ని కబ్జా చేయించారని ఆరోపించింది సిరిసిల్ల బీవై నగర్ కి చెందిన సువర్ణ. ఈ విషయంపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. తర్వాత బయటకు వచ్చి వెంట తెచ్చుకున్న కిరోసిన్ పోసుకోని ఆత్యహత్నానికి ప్రయత్నించింది. అక్కడున్నవారు ఆమెను అడ్డుకున్నారు.

అయితే ఇప్పటికే చాలాసార్లు అధికారులను వేడుకున్నానని ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది సువర్ణ. ఊరికి వెళ్లి వచ్చే సరికి తన స్థలంలో ఇల్లు కట్టారని చెబుతోంది. అయితే ఎలాంటి కబ్జాలు, అక్రమాలు చేయలేదంటున్నారు మున్సిపల్ వైస్ చైర్మన్ కనకయ్య.

Posted in Uncategorized

Latest Updates