స్థానికుల భయాందోళనలు : రాణిగంజ్ లో మంటల బీభత్సం

FIREహైదరాబాద్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం (జూన్-8) సాయంత్రం సికింద్రాబాద్, రాణిగంజ్ బాంబే హోటల్ సమీపంలోని పెయింట్ గోదాములో సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో భయంతో పరుగులు తీశారు స్థానికులు.  భారీ శబ్దాలతో గోదాములోని పేయింటింగ్ డబ్బాలు పేలాయి. సమాచారమందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. ప్రాణ నష్టం జరగకపోయినా..భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది.

Posted in Uncategorized

Latest Updates