స్నేహితురాలితో నితీశ్ రాణా పెళ్లి

RANAయంగ్ క్రికెటర్ నితీశ్ రాణా ఓ ఇంటి వాడుకాబోతున్నాడు. IPLలో ఈ సారి కోల్ కతా టీమ్ లో ఆడిన ఈ ప్లేయర్.. ఆల్ రౌండర్ గా ఆకట్టుకున్న విషయం తెలిసిందే.  ఆదివారం ఢిల్లీలో తన చిన్ననాటి స్నేహితురాలు సాచి మర్వాతో నితిశ్ రాణాకు నిశ్చితార్థం జరిగింది. అతి తక్కువమంది సన్నిహితులు, స్నేహితుల మధ్య ఇరు కుటుంబాలకు చెందిన వారు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోల్‌ కతా నైట్‌ రైటర్స్‌ తన అఫీషియల్ ట్విటర్ అకౌంట్ ద్వారా కొత్త జంట ఫొటోను షేర్ చేస్తూ విషెస్ తెలిపింది.

ఇటీవల మరో యంగ్ క్రికెటర్ సందీప్ శర్మ(SRH బౌలర్) కూడా పెళ్లి చేసుకుంటున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. మొత్తానికి ఈ IPL సీజన్ అయిపోగానే.. ఎవరికివారు ఫ్యామిలీని సెట్ చేసుకుంటూ సెటిల్ అయిపోతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Posted in Uncategorized

Latest Updates