స్పీడ్ కూడా అంతే : ఈ కారు ధరతో.. విమానం కొనుక్కోవచ్చు

బెంజ్, BMW, ఆడి..లాంటి కార్ల ధరలకే మన దేశంలో వామ్మో అంటాం. అలాంటిది ఈ కారు ధర ఎంతో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. ఈ కారు ఎంతో తెలుసా.. అక్షరాలా 121 కోట్ల రూపాయలు. ఇది.. ముమ్మాటికీ నిజం.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదుకు అమ్ముడుపోయింది. AMGV12 ఇంజిన్‌ గల ఈ కారు బరువు 1250 కేజీలు. 789 హార్స్‌పవర్‌ సామర్థ్యం గలది. ఇటలీకి చెందిన స్పోర్ట్స్‌ కార్ల ఉత్పత్తుల సంస్థ పగానీ ఆటోమొబైల్స్‌ దీన్ని రూపొందించింది. జోండా 760 సిరీస్‌, హుయైరా బీసీ మోడళ్ల హైబ్రిడ్‌ రకమే జోండా HP బార్షెటా. ఈ సంస్థ ప్రపంచంలోనే ఖరీదైన కార్లను తయారు చేస్తోంది. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే జోండా, హుయైరా బ్రాండ్‌ స్పోర్ట్స్‌ కార్లు ఇంటర్నేషనల్ మార్కెట్లో వున్నాయి.

జోండా బ్రాండ్‌లో ఆల్ట్రారేర్‌ జోండా హెచ్‌పీ బార్షెటా కారుని రూపొందించింది. ఇటీవల జరిగిన గుడ్‌వుడ్‌ ఫెస్టివల్‌ లో దీన్ని ఆవిష్కరించారు. ఈ కారు ధర 15 మిలియన్‌ యూరోలు. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 121 కోట్లకు పైమాటే. ఇలాంటివి కేవలం మూడుకార్లు మాత్రమే తయారు చేయాలని కంపెనీ నిర్ణయించింది. అందులో ఇదే మొదటిది. ఈ కార్లన్నీ ఇప్పటికే బుక్ అయిపోయాయి. రేసింగ్‌లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు. ఈ కారు గరిష్ఠంగా గంటకు 338 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు.

Posted in Uncategorized

Latest Updates