స్పృహ లోకి మధులిక.. ఇంకో 24 గంటలు వెంటిలేటర్ పైనే

madhulika opened Eyes after surgery successful Yashoda Hospitals

madhulika opened Eyes after surgery successful Yashoda Hospitalsప్రేమోన్మాది భరత్ దాడిలో గాయపడిన మధులిక ఆరోగ్య పరిస్థితి నిన్నటి కన్నా కొంచెం మెరుగు పడిందన్నారు యశోధ హస్పిటల్ వైద్యులు. నిన్న 7 గంటల పాటు శస్త్ర చికిత్స విజయవంతంగా జరిపినట్లు చెప్పారు. ఇందుకోసం ఐదుగురు డాక్టర్ల బృందం శ్రమించిందని చెప్పారు. బ్రెయిన్ లోకి వెళ్లిన బోన్ ను తీసేశాం. శరీరం లో ఇన్ఫెక్షన్ జరగకుండా గాయాలు అయిన చోట మెరుగాయిన వైద్యం అందిచాము. 20 యూనిట్ల బ్లడ్ మరియు బ్లడ్ ప్రొడక్ట్స్ ఎక్కించి శరీరం లో గాయాలు ఆయన చోట సర్జరీ విజయవంతం గా చేశాం. మధులిక ఆరోగ్య పరిస్థితి నిన్నటి పోల్చుకుంటే కొద్దిగా మెరుగు పడింది. ఇపుడు తాను స్పృహ లోకి వచ్చి కళ్ళు తెరిచి చూడగల్గుతుంది. మరో 24 గంటల తర్వాత బాధితురాలిని వెంటిలేటర్ పై నుంచి తొలగిస్తామని చెప్పారు యశోధ హస్పిటల్ వైద్యులు.

మైనర్ బాలికపై హత్యాయత్నం కేసులో నిందితుడు భరత్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో భరత్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు.

Latest Updates