స్పెషల్ డ్రైవ్ : సిటీలో నో హారన్ ప్లీజ్

no-hornట్రాఫిక్ సమస్యలు..రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టిన ట్రాఫిక్ పోలీసులు…నిబంధనలు ఉల్లంఘిస్తే తగిన శిక్షలు విధిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలతో పాటు ప్రజలను వేధిస్తున్న మరో సమస్య  శబ్ధకాలుష్యం. ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రజలను పట్టి పీడిస్తున్న సమస్య సౌండ్ పొల్యుషన్. దీన్ని అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమవుతున్నారు. కొంచెం ట్రాఫిక్ జాం అయితే చాలు వెనుక ఉన్న వెహికిల్స్ వేసే హారన్లతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సౌండ్ పొల్యుషన్ రోజు రోజుకీ పెరిగిపోతూ ఉండటంతో..దీన్ని అరికట్టడంతో పాటు..ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు పోలీసు ఉన్నతాధికారులు. హైదరాబాద్ నగరాన్ని హారన్ ఫ్రీ సిటీగా మార్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అత్యవసర పరిస్థితుల్లో వాడాల్సిన హారన్లను  ఇష్టాను సారంగా ఉపయోగిస్తున్నారు. దీనికి తోడు వింత వింత సౌండ్లతో వస్తున్న హారన్లతో రోడ్లపై వెళ్లే ప్రయణికులకు ఇబ్బంది కలిగిస్తున్నారు.దీంతో సౌడ్ పొల్యుషన్ కి అడ్డుకట్ట వేసేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. అనవసరంగా హారన్ వాడొద్దంటూ సెల్ ఫోన్లకు మెసేజ్ లు పంపిస్తోంది ట్రాఫిక్ పోలీసు శాఖ.

ఆకస్మికంగా వచ్చే వింత హారన్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హారన్ల ద్వారా వినికిడి సమస్యతో పాటు గుండెపోటు వచ్చే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. దీంతో సౌండ్ పొల్యుషన్ ను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు నో హారన్ ప్లీజ్ అనే నినాదంతో స్పెషల్ డ్రైవ్ చేపట్టేందుకు రెడీ అవుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates