స్పోర్ట్స్ అథారిటీ కమిటీ సభ్యుల ఇళ్లలో ACB సోదాలు

ACBహైదరాబాద్ లో స్పోర్ట్స్ అథారిటీ కమిటీ సభ్యుల ఇళ్లలో సోదాలు జరుపుతోంది ACB. స్పోర్ట్స్ కోటా కింద మెడికల్ సీట్ల భర్తీలో కుంభకోణం జరిగిందని విద్యార్థులు ఆరోపించడంతో.. స్పోర్ట్స్ కమిటీ సభ్యుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు ACB అధికారులు. హబ్సిగూడ, ఎల్బీ స్టేడియంతో పాటు షాప్ కమిటిలో ఉన్న స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ వెంకటరమణ, కమిటీ మెంబర్ శోభ ఇంటితో పాటు మరో ముగ్గురి ఇళ్లలో  సోదాలు జరుగుతున్నాయి. నగరంలోని మరో నాలుగు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు.

స్పోర్ట్స్ కోటా కింద ఉన్న నాలుగు సీట్లను స్టేట్ లెవల్ ఉన్న వాళ్లకు ఇచ్చింది షాప్. అంతేకాదు నకిలీ పత్రాలతో కొందరు స్పోర్ట్స్ కోటా కింద మెడికల్ సీట్లు పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలపై గతంలో ప్రభుత్వం తరపున ద్విసభ్య కమిటి వేసి విచారణకు ఆదేశించిన సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించారు. దీంతో కేసు నమోదు చేసింది ఏసీబీ.

 

Posted in Uncategorized

Latest Updates