స్పోర్ట్స్ జర్నలిస్టులు పాజిటివ్ గా స్పందించాలి: వివేక్ వెంకటస్వామి

vivహైదరాబాద్ సోమాజిగుడ పార్క్ హయత్ హోటల్లో తెలంగాణ స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అవార్డ్స్ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్స్ కు అవార్డులిచ్చింది TSJA. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా HCA ఛైర్మెన్ వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. అవార్డ్స్ ఫంక్షన్ ని విశాక ఇండస్ట్రీస్ స్పాన్సర్ చేసింది. ఈ కార్యక్రమానికి మాజీ క్రికెటర్లు శివలాల్ యాదవ్, టీమిండియా సెలెక్షన్ కమిటీ మెంబర్ ఎమ్మెస్కే ప్రసాద్.. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, షట్లర్ కిదాంబి శ్రీకాంత్ హజరయ్యారు. స్పోర్ట్స్ జర్నలిస్టులు క్రీడల్లో ఎప్పుడూ నెగిటివిటీనే కాదు…. పాజిటివ్ అంశాలనూ వెలికితీయాలని సూచించారు వివేక్.

Posted in Uncategorized

Latest Updates