స్మగ్లర్ల కొత్త ఐడియా : ఎయిర్ పోర్ట్ లో భారీగా పేస్ట్ బంగారం స్వాధీనం

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అక్రమంగా తరలిస్తున్న 1.80 కేజీల బంగారాన్ని కస్టమ్స్ డీఆర్ ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం(జులై-22) ఎయిర్ పోర్ట్ లో తనిఖీలు నిర్వహించిన డీఆర్ఐ అధికారులు.. బంగారాన్ని కరిగించి పేస్ట్ లా మార్చి బ్యాగ్ లో తరలిస్తున్న మధురై నుంచి వచ్చిన ప్రయాణికుడిని అధికారులు పట్టుకున్నారు. బంగారాన్ని సీజ్ చేసిన అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకొన్నారు. అక్రమంగా బంగారాన్ని తరలించే నిందితులకు కొంతకాలంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్…. అడ్డాగా మారింది. ఎన్నిసార్లు కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నప్పట్టికీ ఎయిర్ పోర్ట్ నుంచి గోల్గ్ స్మగ్లింగ్ కొనసాగుతూనే ఉంది.

Posted in Uncategorized

Latest Updates