స్మార్ట్ అండ్ గ్రీన్ : ఢిల్లీ-మీరట్ ఎక్స్ ప్రెస్ వే ఫస్ట్ ఫేజ్ ను ప్రారంభించిన మోడీ

PMకేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఢిల్లీ-మీరట్ ఎక్స్ ప్రెస్ వే ఫస్ట్ ఫేజ్ ను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడి. దేశంలోని తొలి స్మార్ట్ అండ్ గ్రీన్ హైవే ఇదే. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి దీన్ని ప్రారంభించారు. ఢిల్లీకి ఈశాన్య రాష్ట్రాలను కలిపే ఈ రోడ్డు మొత్తం పొడవు 135 కిలోమీటర్లు. నాలుగుదశల్లో దీన్ని పూర్తిచేయడం లక్ష్యం. 27.74 కిలోమీటర్లు 14 లేన్లు కాగా, మిగతా దూరం 6 లేన్లు. ఈ ప్రాజెక్టు వ్యయం 4 వేల 975 కోట్లు. అందులో ఫస్ట్ ఫేజ్ కింద మీటర్ నుంచి ఢిల్లీకి ప్రధాని ఓపెన్ చేశారు. 2015 డిసెంబర్ 31న ఈ ఎక్స్ ప్రెస్ హైవేకు ఫౌండేషన్ స్టోన్ వేశారు ప్రధాని నరేంద్ర మోడి. మొదటిదశ 18 నెలల్లో పూర్తిచేయాలి. కానీ నితిన్ గడ్కరీ చొరవతో 14 నెలల్లోనే పూర్తైంది. సోలార్ లైట్లు, డ్రిప్ సిస్టమ్ తో చెట్లకు నీళ్లు పంప్ చేసేలా ఈ రోడ్డు స్పెషాలిటీ. అత్యంత వేగంగా.. అత్యంత సురక్షితంగా ఢిల్లీ-మీరట్ మధ్య ప్రయాణం సాగించేలా దీన్ని నిర్మించారు.

Posted in Uncategorized

Latest Updates