స్మాల్ బ్రేక్ : ఆ రూట్లలో మెట్రో ప్రారంభం ఆలస్యం

metroమెట్రో రైలు ఫుల్ కనెక్టివిటీపై ప్రకటన చేశారు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. ఎల్బీ నగర్ నుంచి అమీర్ పేట రూట్ రాకపోకలను జూన్ లో ప్రారంభించాలని మొదట భావించారు. అయితే CTS టెక్నాలజీ అప్ గ్రేడ్ తో ఆగస్ట్ లో ప్రారంభించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అదే విధంగా అమీర్ పేట – హైటెక్ సిటీ రూట్ లో రాకపోకలు అక్టోబర్ నుంచి ఉంటాయని తెలిపారు. ఈ రెండు రూట్లలో అనుకున్న టైం కంటే.. రెండు నెలలు ఆలస్యం అవుతుందన్నారు.

ప్రస్తుతం నడుస్తున్న మియాపూర్ – అమీర్ పేట రూట్ లో రైలు వేగం పెరిగినట్లు తెలిపారు. స్పీడ్ పెంచటంతో ప్రయాణికుల స్పందన కూడా బాగుందన్నారు. అయితే మెట్టుగూడ – అమీర్ పేట మాత్రం రైళ్లు స్లోగా నడుస్తున్నాయని తెలిపారు. దీనికి కారణం CBT టెక్నాలజీ లేకపోవటమే అన్నారు. ప్రస్తుతం ఈ రెండు రూట్లలో ప్రతి రోజూ 60వేల మంది ప్రయాణికులు మైట్రో రైలులో తిరుగుతున్నట్లు వివరించారు.

Posted in Uncategorized

Latest Updates